Share News

జిమ్‌లో వివాహితపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:20 AM

జిమ్‌కు వచ్చే మహిళపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు, ఆమెను వేధించిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని 13వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం.వాణి తీర్పు ఇచ్చారు.

జిమ్‌లో వివాహితపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిమ్‌కు వచ్చే మహిళపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు, ఆమెను వేధించిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని 13వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం.వాణి తీర్పు ఇచ్చారు. నిందితుడు మహ్మద్‌ మౌజమ్‌ అలీ (39)కి జైలు శిక్షతోపాటు రూ.8 వేల జరిమానా కూడా విధించారు. ఓ జిమ్‌లో ఫిట్‌నెస్‌ ట్రైయినర్‌గా పనిచేస్తున్న మౌజమ్‌ అలీ 2015 జనవరి నుంచి అక్కడి మహిళల టాయిలెట్‌లో తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది.


తన ఫ్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించి లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపింది. వేధింపులు భరించలేక 2017 ఫిబ్రవరి 11న భర్తకు విషయం చెప్పిన బాధితురాలు రెండు రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించింది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 06:21 AM