బంగారం వ్యాపారి కిడ్నాప్
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:13 AM
హైదరాబాద్‌లో బంగారం వ్యాపారి అపహరణ ఘటన కలకలం రేపింది. చిక్కడపల్లిలో నివసిస్తున్న శ్రీనివా్‌సరావుకు రామంతాపూర్‌లో బంగారు ఆభరణాల దుకాణం ఉంది. సోమవారం ఉదయం దుకాణానికి వెళ్లిన ఆయనను కిడ్నాప్ చేసినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది.
రూ.కోటిన్నర ఇస్తేనే వదులుతామని ఫోన్
సొమ్ముతో భార్య వెళ్లగా.. పోలీసులను గమనించి కిడ్నాపర్ల పరార్ ?
వ్యాపారిని కర్నూలుకు తీసుకెళ్లినట్లు సమాచారం
వర్చువల్ కాల్స్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తున్న కిడ్నాపర్లు
నాలుగు పోలీసు బృందాలతో గాలింపు
చిక్కడపల్లి/రాంనగర్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో బంగారం వ్యాపారి అపహరణ ఘటన కలకలం రేపింది. చిక్కడపల్లిలో నివసిస్తున్న శ్రీనివాస్‌రావుకు రామంతాపూర్‌లో బంగారు ఆభరణాల దుకాణం ఉంది. సోమవారం ఉదయం దుకాణానికి వెళ్లిన ఆయనను కిడ్నాప్ చేసినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. రూ. కోటిన్నర చెల్లిస్తేనే విడుదల చేస్తామని కిడ్నాపర్లు వ్యాపారి భార్యను ఫోన్‌లో డిమాండ్ చేశారు. సొమ్ముతో మెహదీపట్నంలోని కాళీమాత ఆలయం వద్దకు రావాలని సూచించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున రూ.70 లక్షలు తీసుకొని ఆమె అక్కడకు వెళ్లారు. అయితే ఆమె వెనుక పోలీసులు ఉన్నారని గమనించిన కిడ్నాపర్లు డబ్బు తీసుకోకుండా పారిపోయారని తెలిసింది.
ఈ క్రమంలో కిడ్నాపర్లు వ్యాపారిని తీసుకుని కర్నూలు వైపు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. కాగా కిడ్నాపర్లు తమ లొకేషన్‌ను పోలీసులు గుర్తించకుండా జాగ్రత్త పడుతూ... వ్యాపారితో వర్చువల్ కాల్స్‌లో డబ్బులు గురించి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తున్నారు. రూ.కోటిన్నర చెల్లించాల్సిందేనంటూ.. పోలీసులు వస్తే వ్యాపారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన వ్యాపారి భార్య కిడ్నాపర్లు డిమాండ్ చెసిన సొమ్ము ఇచ్చి తన భర్తను విడిపించుకుంటానని, పోలీసులను రావద్దని కోరుతున్నట్లు తెలిసింది. హైదారాబాద్ నుంచి వెళ్లిన 4 పోలీసు బృందాలు కర్నూలులో గాలింపు ముమ్మరం చేశాయి. మంగళవారం రాత్రి వరకు శ్రీనివా్‌సరావు ఆచూకీ దొరకలేదని చిక్కడపల్లి ఏసీపీ రణవీర్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
పగలు భగభగ.. రాత్రి గజగజ
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి
పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన టీస్టాల్ నిర్వాహకుడు సుధాకర్ మృతి
Read Latest AP News And Telugu News