హైదరాబాద్‌లో దారుణం.. యువకుడికి గుండు గీయించి, నగ్నంగా డ్యాన్స్ చేయించిన నిందితులు
ABN , Publish Date - Oct 22 , 2026 | 07:07 AM
హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. కారు అద్దె, మరమ్మతు డబ్బులు చెల్లించలేదని ఓ యువకుడిపై ఐదుగురు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుడికి గుండు గీయించి, నగ్నంగా డ్యాన్సులు చేయించడం పెను సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. కారు అద్దె, మరమ్మతు డబ్బులు చెల్లించలేదని ఓ యువకుడిపై ఐదుగురు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుడికి గుండు గీయించి, నగ్నంగా డ్యాన్సులు చేయించడం పెను సంచలనం సృష్టిస్తోంది.
అల్కాపూర్‌కు చెందిన మాలిక్ అనే వ్యక్తి నౌమాన్ వద్ద కమీషన్ ప్రాతిపదికన కారు తీసుకుని అద్దెకు ఇస్తుంటాడు. ఈ క్రమంలో ఆరు నెలల కిందట గుడిమల్కాపూర్‌కు చెందిన అర్బాజ్‌కు మాలిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు ఇచ్చాడు. వాహనాన్ని నడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ దానికి గీతలు పడ్డాయి. దీంతో వివాదం చెలరేగింది. అద్దె డబ్బులతోపాటు మరమ్మతుల నిమిత్తం రూ.40 వేలు చెల్లించాలని మాలిక్ డిమాండ్ చేశాడు. అర్బాజ్ కొంత మొత్తం చెల్లించినప్పటికీ, మిగిలిన డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో రెండు రోజుల కిందట అతడిని గుల్షన్ కాలనీలోని ఓ ఇంటికి నిందితులు తీసుకెళ్లారు.
మాలిక్‌తోపాటు అతని స్నేహితులు ముస్తఫా, ఖుర్రం, మాజ్, ఫర్దీన్ కలిసి అర్బాజ్‌పై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా యువకుడికి గుండు గీయించారు. ఆపై బట్టలు విప్పించి, నగ్నంగా నృత్యం చేయిస్తూ వీడియోలు తీశారు. అర్బాజ్ ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ వార్తలు కూడా చదవండి
రాష్ట్ర పక్షిని బోనులో బంధిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్
నిమ్స్‌లో లక్ష్మీ భాస్కర్ గ్యాంగ్