హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు.. టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:44 PM
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ తయారీ కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలోనే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తోన్న ఒక భారీ ముఠా గుట్టును రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, మార్చి 07: నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న ఒక భారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ (Hyderabad)లోని లాలాపేట(Lalapet) పరిధిలో నిర్వహిస్తున్న ఒక గోడౌన్ పై టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ జోన్, లాలాగూడ పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందానికి అందిన ముందస్తు సమాచారంతో లాలాగూడ(Lalaguda) పోలీసులతో కలిసి లాలాపేటలోని ‘జానీ అల్లం వెల్లుల్లి పేస్ట్’ గోడౌన్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అత్యంత అపరిశుభ్రమైన వాతావారణంలో ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని, రంగు మారకుండా ఉండటానికి నిందితులు ఎసిటిన్ యాసిడ్(Acetic Acid) వంటి రసాయనాలు కలుపుతున్నట్లు తేలింది. ఈ సోదాల్లో దాదాపు 1,915 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 30 కిలోల ఎసిటిక్ యాసిడ్, పేస్టు తయారీకి ఉపయోగించే యంత్రాలు, ఇతర ముడి సరకులు, ప్యాకింగ్ మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీలా వెంకటేశ్వర్లుతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం లాలాగూడ పోలీసులు తీసుకెళ్లారు. నకిలీ బ్రాండ్ లేబుల్స్ తో ప్యాకింగ్ చేసి నగరాల్లోని పలు కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే
Read Latest AP News And Telugu News