Share News

ఫర్నిచర్ గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:57 AM

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మొగల్ ఖానాల వద్ద ఫర్నిచర్ గోదాముల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో ఫర్నిచర్ కాలి బూడిదైంది.

ఫర్నిచర్ గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
Hyderabad Fire Accident

హైదరాబాద్: గుడిమల్కాపూర్ (Gudimalkapur) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. మొగల్ ఖానాల వద్ద ఫర్నిచర్ గోదాముల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ కాలి బూడిదైంది. తొలుత ఓ గిడ్డంగికి మంటలు అంటుకోగా.. అనంతరం పక్కనే ఉన్న మరో మూడింటికి వ్యాపించాయి. మొత్తం నాలుగు గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి.


స్థానికుల సమాచారంతో ఐదు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక దళం ఘటనాస్థలికి చేరుకుంది. ప్రస్తుతం రెండు గిడ్డంగుల్లో మంటలు అదుపులోకి రాగా.. మరో రెండింటిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాముల్లో ప్లాస్టిక్, చెక్క వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. పక్కనే చాలా గోదాములు ఉండటంతో యజమానుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు, ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గచ్చిబౌలి ఘటన.. టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

Updated Date - Aug 23 , 2026 | 12:14 PM