పేషెంట్ల నగలు దోపిడీ చేసిన నకిలీ డాక్టర్ అరెస్ట్
ABN , Publish Date - Mar 17 , 2026 | 08:02 PM
హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. యశోద, సిటిజన్ ఆసుపత్రుల్లో రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నగలు దోపిడీ చేసిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: యశోద, సిటిజన్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి నగలు దోపిడి చేసిన నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. ఈ దోపిడీకి పాల్పడుతున్న దంపతులు గౌండ్ల శిరీష, సాయికుమార్ గౌడ్ అని అధికారులు గుర్తించారు. దంపతుల నుంచి 11 తులాల బంగారం, కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఫార్మా విద్యార్థిని అయిన శిరీష తన వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఆసుపత్రుల్లో రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నగలను దోపిడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే
తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం
Read Latest Telangana News