లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన చందానగర్ ఎస్ఐ
ABN , Publish Date - Aug 22 , 2026 | 08:12 PM
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాలరాజు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్‌లను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 22: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాలరాజు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్‌లను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి నుంచి లక్ష రూపాయిలు లంచం తీసుకుంటుండగా.. ఎస్ఐతోపాటు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు వలపన్నీ పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారందరిని పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లంచం వ్యవహారంలో పూర్తి వివరాలను వారి నుంచి ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోడ్లు, బ్రిడ్జి పనుల వేగం పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి
రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల
Read More Latest Telangana News And Telugu News