నేడు బమృక్ ఉద్దౌలా చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:51 PM
బతుకమ్మ కుంటను పునరుద్ధరించి అందరి ప్రశంసలు పొందిన తెలంగాణ ప్రభుత్వం మరో చెరువుకు జీవం పోసింది. ఓల్డ్ సిటీలోని బమృక్ ఉద్దౌలా చెరువును నేడు( మార్చి 08) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
హైదరాబాద్, మార్చి 08: బతుకమ్మ కుంటను పునరుద్ధరించి అందరి ప్రశంసలు పొందిన తెలంగాణ ప్రభుత్వం మరో చెరువుకు జీవం పోసింది. ఓల్డ్ సిటీలోని బమృక్ ఉద్దౌలా చెరువును(Bam Rukn Ud Daula Lake) నేడు( మార్చి 08) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ చెరువును సీఎం ప్రారంభించనున్నారు.
ఈ చెరువు ఓల్డ్ సిటీకి తలమానికంగా ఉంది. అలానే 450 ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. ఈ చెరువును రూ.9 కోట్లతో పూర్తి చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో బమృక్ ఉద్దౌలా చెరువును తెలంగాణ అభివృద్ధి చేసింది. చెరువు చుట్టూ ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు సహా కీలక నిర్మాణాలు చెపట్టింది. ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, పిల్లల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. అలానే ఈ ప్రాంతంలో భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న సీసీటీవీ కెమెరాల ద్వారా హైడ్రా(HYDRA) ప్రధాన కార్యాలయం నుంచి నిరంతరం మానిటరింగ్ జరుగనుంది.
1770లో నిజాం ప్రధాని నవాబ్ రుక్న్ ఉద్దౌలా ఈ చెరువును నిర్మించారు. అప్పట్లో ఈ చెరువు 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉండేది. ఈ చెరువులోని నీటిని ఒకప్పుడు సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించేవారని స్థానికులు చెబుతున్నారు. గడిచిన 50 ఏళ్లలో ఆక్రమణలతో ఈ చెరువు రూపు రేఖలు కోల్పోయింది. ఈ చెరువు కబ్జాకు గురై.. భారీగా నిర్మాణాలు.. కొత్తగా కాలనీలు వెలిశాయి. రెండేళ్ల క్రితం హైడ్రా ఈ చెరువు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి సుందరీకరణ పనులు ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి:
ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట: సీతక్క
రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది: బండి సంజయ్