Share News

హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉద్రిక్తత.. 'ధురంధర్‌2' సినిమా ప్రదర్శనలో ఘర్షణ

ABN , Publish Date - Mar 25 , 2026 | 10:11 AM

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఒక సినిమా థియేటర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘ధురంధర్ 2’ సినిమా సెకండ్ షో పడిన కొద్దిసేపటి‌కే, రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉద్రిక్తత.. 'ధురంధర్‌2' సినిమా ప్రదర్శనలో ఘర్షణ
Hyderabad Theater Clash

హైదరాబాద్, మార్చి 25: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఒక సినిమా థియేటర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘ధురంధర్ 2’ సినిమా సెకండ్ షో పడిన కొద్దిసేపటి‌కే, రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. దీంతో సినిమా చూడటానికి వచ్చిన మిగిలిన ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. అత్తాపూర్‌లో ఒక సినిమా థియేటర్లో ‘ధురంధర్ 2’ మూవీ సెకండ్ షో మొదలైంది. వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి, ముందు సీటును కాళ్లతో పదే పదే తాకుతున్నాడని ఓ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి గొడవ మొదలైంది. సహనం కోల్పోయి థియేటర్లో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో థియేటర్లలో మిగిలిన ఆడియన్స్ ఏం జరుగుతోందో అని ఆందోళన చెందారు.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే థియేటర్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గొడవ పడుతున్న ఇరు కుటుంబాలను సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పోలీసులు తమదైన శైలిలో కలుగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవకు కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అర్ధరాత్రి గొడవ పెద్దది కావడంతో తోటి ప్రేక్షకులకు అంతరాయం కలగడమే కాకుండా, కొంతమంది ప్రేక్షకులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు!

For More AP News And Telugu News

Updated Date - Mar 25 , 2026 | 10:34 AM