Share News

హైదరాబాద్ భారీ చోరీ.. రూ.17 లక్షలతో ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ పరార్!

ABN , Publish Date - Jun 23 , 2026 | 06:01 PM

నగరంలోని పాతబస్తీలో మంగళవారం భారీ చోరీ కలకలం రేపింది. ఓ ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్.. రూ.17 లక్షల నగదును అపహరించి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ భారీ చోరీ.. రూ.17 లక్షలతో ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ పరార్!
ATM Cash Van Theft

హైదరాబాద్, జూన్ 23: నగరంలోని పాతబస్తీలో మంగళవారం భారీ చోరీ కలకలం రేపింది. ఓ ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్.. రూ.17 లక్షల నగదును అపహరించి పరారయ్యాడు. పక్కా ప్రణాళికతోనే ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదును దొంగిలించిన అనంతరం సదరు డ్రైవర్, ముందుగానే అక్కడ సిద్ధంగా ఏర్పాటు చేసుకున్న బైక్‌పై ఎక్కి క్షణాల్లో మాయమయ్యాడు.


పగటిపూట రద్దీగా ఉండే పాతబస్తీ ప్రాంతంలో ఈ తరహా భారీ చోరీ జరగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు చార్మినార్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి, వాటి ఆధారంగా నిందితుడి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రైవర్ కదలికలు, బైక్ వెళ్లిన దారి, ఘటనకు ముందు, తర్వాత అతడి ఫోన్స్ కాల్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ భారీ స్కామ్‌లో డ్రైవర్‌కు బయటి వ్యక్తులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

గోల్డ్ రేట్స్.. మళ్లీ పడిపోయిన ధరలు

ఏఐ కారణంగా లేఆఫ్స్.. ఒరాకిల్ ధ్రువీకరణ

Updated Date - Jun 23 , 2026 | 07:15 PM