Share News

హరీశ్‌రావు కేసులో నాంపల్లి కోర్టు సమన్లు

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:06 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణకు రావాల్సిందిగా టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది.

హరీశ్‌రావు కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Harish Rao

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావు వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణకు రావాల్సిందిగా టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేశారంటూ హరీశ్‌రావు వేసిన దావాను విచారించిన న్యాయస్థానం 29వ తేదీన కోర్టుకు రావాల్సిందిగా మహేష్‌, దయాకర్‌కు సమన్లు ఇచ్చింది. రాష్ట్రంలో వర్షాలు పడకుండా క్షుద్రపూజలు చేశానంటూ మహేష్‌, దయాకర్‌ తనపై ఘోరమైన అపవాదు వేశారని హరీశ్‌ ఈ దావా వేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో సమర్పించడం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

రాత్రి వేళల్లో రోడ్లపై బర్త్‌ డే పార్టీలొద్దు!
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!

నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 07:06 AM