Goat Blood Mafia: జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరణ.. కేసు నమోదు
ABN , Publish Date - Jan 09 , 2026 | 02:48 PM
మేక రక్తం మాఫియాపై కీసర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మూగజీవుల నుంచి రక్తం తీసేందుకు ఎలాంటి అనుమతి పొందలేదని పోలీసులు గుర్తించారు.
మేడ్చల్, జనవరి 9: జంతువుల నుంచి రక్తం సేకరణ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్‌కేసర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వాణి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మూగజీవుల నుంచి రక్తం తీసేందుకు ఎలాంటి అనుమతి పొందలేదని పోలీసులు గుర్తించారు. సోను మటన్ అండ్ చికెన్ షాప్‌పై బీఎన్‌ఎస్ 223తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ (పీసీఏఏ) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై వెటర్నరీ అధికారులు ఇచ్చిన నివేదికను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ పరిశీలించారు.
కాగా.. సోను మటన్ షాప్‌లో జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈనెల 4న నాగారంలోని సోను మటన్ షాపుపై కీసర పోలీసులు దాడులు చేయగా.. 130 ప్యాకెట్ల మేకల రక్తం లభించింది. మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రక్తాన్ని కాచిగూడలోని సీఎన్‌కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు తరలించి.. అక్కడి నుంచి లేబొరేటరీల్లో ప్లేట్‌లెట్ల తయారీకి వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ‘గోట్ బ్లడ్ మాఫియా’ ఎలాంటి వైద్య ప్రమాణాలూ పాటించకుండా మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరించి, దాన్ని ప్లేట్‌లెట్ల తయారీకి తరలిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇవి కూడా చదవండి..
కేటీఆర్‌పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్
రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేష్
Read Latest Telangana News And Telugu News