ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణను కలిసిన గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్ గురురాజు
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:11 AM
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణను గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ పి.గురురాజు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణను గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ పి.గురురాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిల్మ్‌నగర్‌లోని సంస్థల నూతన కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఆయన.. వేమూరి రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల సంక్షేమం, అమెరికాలో ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. ఈ ఆత్మీయ భేటీలో వాసిరెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!