విషాదం.. రైలు కిందపడి దంపతుల మృతి
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:13 AM
మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో రైలు కిందపడి దంపతులు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషగా గుర్తించారు.
మేడ్చల్, జులై 3: జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో రైలు కిందపడి దంపతులు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న(గురువారం) రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషగా గుర్తించారు. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఘట్కేసర్- బీబీనగర్ రైల్వే మార్గంలో రైలు కిందపడి దంపతులు మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే జీఆర్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దంపతుల మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. రవికుమార్, శిరీష మృతితో పాపయ్యపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లోని లాడ్జ్‌లో యువతి అనుమానాస్పద మృతి
మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News