Share News

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:09 PM

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది.

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్
Hyderabad ganja chocolates

హైదరాబాద్, ఆగస్టు 22: విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. నగరంలో దాదాపు 23 కిలోల గంజాయి చాక్లెట్లను కుత్బుల్లాపూర్ జోన్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ చాకెట్లను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులే లక్ష్యంగా చేసుకుని అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడింది.


గాజులరామారం, మహాదేవపురంకు చెందిన ముగ్గురు యువకులతో పాటు ఓ లేడీని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఎవరి దగ్గర నుంచి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేశారు? దీని వెనకాల ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

వెలిగొండ నిర్వాసితులకు పరిహారం.. మూడో విడతగా రూ.250 కోట్ల పంపిణీ

హైదరాబాద్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 12:34 PM