ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కష్టం: లొంగిపోయిన మావోయిస్టు నరహరి
ABN , Publish Date - May 26 , 2026 | 04:23 PM
ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు చేపట్టిన సాయుధ పోరాటం కష్టంగా మారిందని ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పసునూరి నరహరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మావోయిస్టులు నరహరితోపాటు ఆయన భార్య ధనమ్మను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
హైదరాబాద్, మే 26: ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు చేపట్టిన సాయుధ పోరాటం కష్టంగా మారిందని ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పసునూరి నరహరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మావోయిస్టులు నరహరితోపాటు ఆయన భార్య ధనమ్మను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లొంగిపోయిన నరహరి మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్, తెలంగాణతోపాటు మిగతా ప్రాంతాల్లో సాయుధ పోరాటం పరంగా అనేక నష్టాలు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాలు కారణంగానే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని స్పష్టం చేశారు.
జార్ఖండ్‌లోని మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిరి బిశ్రా అనుమతితోనే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధన చట్టపరంగానే జరగాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయలు, సాయుధ పోరాటంలో చోటు చేసుకున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజా జీవితంలోకి రావాలని మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావును నరహరి కోరారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు డీజీపీ సీవీ ఆనంద్‌కు పసునూరి నరహరి కృతజ్ఞతలు తెలిపారు. మే 12వ తేదీన తెలంగాణ పోలీసులు ఎదుట మావోయిస్టులు నరహరితోపాటు ధనమ్మ లొంగిపోయారు. వీరిని మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం తరఫున వారికి డీజీపీ నగదు చెక్కులను అందజేశారు. అజ్ఞాతంలో ఉన్న 47 మంది మావోయిస్టులు కూడా లొంగి పోవాలని ఈ సందర్భంగా డీజీపీ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ
Read Latest Telangana News And Telugu News