పెట్టుబడుల పేరుతో మోసం.. ఫిఫా ప్రసార హక్కుల సంస్థకు రూ.2 కోట్ల టోకరా
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:58 AM
పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు పొందిన మెటాలాయిడ్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, జులై 9: పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు పొందిన మెటాలాయిడ్ (Metalloid) సంస్థను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టర్ల కోసం చూసిన మెటాలాయిడ్ సంస్థను అమెరికాకు చెందిన దిలీప్ అనే వ్యక్తం మోసం చేశాడు. అమెరికాకు చెందిన అవ్నీ (Avni) అనే సంస్థ ప్రతినిధి దిలీప్.. మెటాలాయిడ్ సంస్థలో 50 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెడతానని నమ్మించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందుకు కోసం బ్యాంక్ గ్యారంటీలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు ఖాతాల వివరాలను సంస్థకు చూపించాడు దిలీప్.
దిలీప్ అందజేసిన బ్యాంక్ గ్యారంటీలు నకిలీవని తేలడంతో మెటాలాయిడ్ సంస్థ మోసపోయినట్లు గుర్తించింది. ఈ వ్యవహారం వల్ల సంస్థకు సుమారు రూ.2 కోట్ల నష్టంతో పాటు సంస్థ ప్రతిష్ఠను దిగజార్చారని మెటాలాయిడ్ యాజమాన్యం ఆరోపించింది. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు సంస్థ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెట్టుబడుల పేరుతో మోసానికి ఉపయోగించిన పత్రాలు, బ్యాంక్ గ్యారంటీలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
యూట్యూబర్ జోసఫ్ రావణ్ బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్
బస్ కోసం వేచి చూస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన బొలెరో
Read Latest Telangana News And Telugu News