కుటుంబ కలహాలతో నాలుగేళ్ల కొడుకును పిల్లర్‌కు కొట్టిన తండ్రి..
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:33 PM
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తండ్రి.. నాలుగేళ్ల కుమారుడిపై పైశాచికంగా దాడి చేశాడు.
హైదరాబాద్, ఆగస్టు 5: నగరంలోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తండ్రి.. నాలుగేళ్ల కుమారుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తండ్రి సల్మాన్.. కొడుకు అర్మాన్‌ను ఓ పిల్లర్‌కు బలంగా కొట్టి నేలపై పడేశాడు. అంతటితో ఆగకుండా బాలుడిని లారీ కిందకు నెట్టేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాలుడిని కాపాడారు. తీవ్రంగా గాయపడిన అర్మాన్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గుడిమల్కాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
ఆర్‌ఎస్ ప్రవీణ్.. కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారు: సంపత్ కుమార్
నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు: హరీశ్ రావు
Read Latest Telangana News And Telugu News