Share News

తెలంగాణలో మరోసారి 'సర్‌' గడువు పొడిగింపు

ABN , Publish Date - Sep 07 , 2026 | 06:36 PM

తెలంగాణలో సర్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణకు ఉన్న గడువును మరోసారి పొడిగించింది.

తెలంగాణలో మరోసారి 'సర్‌' గడువు పొడిగింపు
Telangana SIR

హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణకు ఉన్న గడువును పొడిగించింది. ముందుగా ఈ నెల 16 వరకు ఉన్న గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు తెలిపింది.


క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ అనంతరం వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రక్రియను నవంబర్ 5లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారం పూర్తైన తర్వాత నవంబర్ 9న తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.


Also Read:

శాసనసభ కాదు.. దుశ్శాసనసభ. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం!

లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Updated Date - Sep 07 , 2026 | 06:40 PM