Share News

హైదరాబాద్‌లో రెండు రోజుల్లోనే 129 మంది మందుబాబులపై కేసులు

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:59 PM

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించగా.. రెండు రోజుల్లోనే ట్రాఫిక్ పోలీసులు 129 మంది మందుబాబులను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో రెండు రోజుల్లోనే 129 మంది మందుబాబులపై కేసులు
drunk and drive special drive in hyd

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా.. రెండు రోజుల్లోనే 129 మందిని అరెస్ట్ చేశారు.


మొత్తం129 మందిలో 101 మంది ద్విచక్ర వాహనదారులు కాగా.. 10 మంది ఆటోడ్రైవర్లు, 18 మంది కారు డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురికి బీఏసీ పాయింట్లు 300కు పైగా నమోదైందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఎవరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు తెలిపారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఎస్బీఐ ఏటీఎంల చోరీ..

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడి మృతి

Updated Date - Sep 20 , 2026 | 07:14 PM