Share News

దోస్త్‌లో 2,13,671 మందికి ప్రవేశాలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:36 AM

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈ విద్యాసంవత్సరం మూడు విడతల సాధారణ కౌన్సెలింగ్‌తో పాటు రెండు ప్రత్యేక విడతలు, స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా ప్రవేశాలు కల్పించారు.

దోస్త్‌లో 2,13,671 మందికి ప్రవేశాలు
DOST admissions

  • ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీలో 82శాతం సీట్ల భర్తీ

హైదరాబాద్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈ విద్యాసంవత్సరం మూడు విడతల సాధారణ కౌన్సెలింగ్‌తో పాటు రెండు ప్రత్యేక విడతలు, స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా ప్రవేశాలు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 784కాలేజీల్లో 4,42,450 సీట్లకు గాను, ఈసారి 2,13,671సీట్లు భర్తీ అయినట్లు ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిష్టారెడ్డి వెల్లడించారు.


గతేడాదితో పోలిస్తే ఈ విడతలో 8,531 సీట్లు భర్తీ కావడం విశేషం. కోర్సుల వారీగా చూస్తే విద్యార్థులు ఎప్పటిలాగే బీకాం వైపే మొగ్గు చూపారు. అత్యధికంగా బీకాంలో 77,113 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల్లో 370 సీట్లకు గాను 302 సీట్లు (82 శాతం) భర్తీ అయ్యాయి.


ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌ ఉపన్యాసాలు

గౌరవం లేని చోట ఉండలేను
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 06:36 AM