Share News

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:40 PM

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
Danam Nagender

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఏబీఎన్‌తో దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేశుడి ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలో పోరాడుతానని దానం నాగేందర్ అన్నారు. ఉప ఎన్నికకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఖైరతాబాద్ గణేశుడు ఎలా ఫేమస్ అయ్యాడో.. హైకోర్టు తీర్పుతో దేశ స్థాయిలో తాను కూడా చాలా ఫేమస్ అయ్యానన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఉప ఎన్నిక వస్తే ప్రజల రుణం తీర్చుకుంటానని దానం నాగేందర్ పేర్కొన్నారు.


Also Read:

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్‌

శుక్ర యోగం.. ఈ 3 రాశుల వారికి శుభ ఫలితాలు.!

Updated Date - Sep 19 , 2026 | 07:00 PM