ప్రేమ పేరుతో నయవంచకులుంటారు
ABN , Publish Date - Feb 14 , 2026 | 10:57 AM
ప్రేమ పేరుతో కొంతమంది పోకిరీలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2 శేషాద్రిని రెడ్డి హెచ్చరించారు.
డీసీపీ శేషాద్రిని రెడ్డి
హైదరాబాద్ సిటీ: ప్రేమ పేరుతో కొంతమంది పోకిరీలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2 శేషాద్రిని రెడ్డి(Cyberabad Traffic DCP-2 Seshadrini Reddy) హెచ్చరించారు. వాలెంటైన్స్ డే రోజున అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిందని, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో బాలికలను పరిచయం చేసుకుంటున్న మృగాళ్లు.. ప్రేమ పేరుతో వంచనకు గురిచేస్తున్నారన్నారు.
వారి మాటలు నమ్మి ఇంట్లోంచి బయటకు వస్తున్న చిన్నారులు లైంగిక దాడులకు గురవుతున్నారని, ఇలాంటి పోకిరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా హోటల్లో యువతీ యువకులకు రూమ్స్ ఇచ్చేటప్పుడు ధ్రువపత్రాలను కచ్చితంగా క్రాస్‌చెక్ చేసుకోవాలని సూచించారు. మైనర్స్ అని తెలిసీ గదులు అద్దెకు ఇచ్చినా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడినా ఆ తర్వాత చట్టప్రకారం శిక్షార్హులు అవుతారని హోటల్ యాజమాన్యాలను డీసీపీ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు
అల్లు వారి.. పెళ్లి పనులు షురూ
Read Latest Telangana News and National News