ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మద్దతు: కూనంనేని
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:26 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సామా రామ్మోహన్‌రెడ్డి... బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో కూనంనేని సాంబశివరావును, ఆ పార్టీ రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News