Share News

రేపు కాంగ్రెస్‌ సంవిధాన్‌ రక్షా మార్చ్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:04 AM

ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ గురువారం హైదరాబాద్‌లో సంవిధాన్‌ రక్షా మార్చ్‌ను నిర్వహిస్తోంది.

రేపు కాంగ్రెస్‌ సంవిధాన్‌ రక్షా మార్చ్‌

  • భారీగా కాంగ్రెస్‌ శ్రేణుల సమీకరణ.. పాల్గొననున్న సీఎం

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ గురువారం హైదరాబాద్‌లో సంవిధాన్‌ రక్షా మార్చ్‌ను నిర్వహిస్తోంది. ఉదయం 10.30 గంటలకు ట్యాంక్‌బండ్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు జరిగే ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్‌కుమార్‌, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. సుమారు 28 వేల మంది పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 25 , 2026 | 05:04 AM