Share News

జెన్ జీపై ప్రేముంటే జంతర్ మంతర్‌ వద్ద దీక్ష చేయండి.. బీఆర్ఎస్ అగ్రనేతలకు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:36 PM

తెలంగాణలో విద్యా శాఖను జెన్ జీకి అప్పగించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత సామ రామ్మోహన్ రెడ్డి స్పందించారు.

జెన్ జీపై ప్రేముంటే జంతర్ మంతర్‌ వద్ద దీక్ష చేయండి.. బీఆర్ఎస్ అగ్రనేతలకు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్
Congress Leader Sama Rammohan reddy

హైదరాబాద్, జులై 31: తెలంగాణలో విద్యా శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ శాఖను జెన్ జీకి అప్పగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ అగ్రనేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావులకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.


జెన్ జీపై వీరికి నిజంగానే ప్రేముంటే.. ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టాలని సూచించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీమానాలను డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టాలని వారికి స్పష్టం చేశారు. వారిద్దరు.. తమ పదవులకు రాజీనామా చేసే వరకు వీరు దీక్ష విరమించకూడదని అన్నారు. ఓ వేళ వీరు ఆ విధంగా దీక్ష మధ్యలోనే విరమిస్తే.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని భావించాల్సి ఉంటుందన్నారు. అలా జెన్ జీ ముందు ఒప్పుకోవాలంటూ వారికి సూచించారు.


కేవలం రాజకీయం కోసం బీఆర్ఎస్ నేతలు ఇలాంటి నాటకాలకు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ ఏ విధంగా సమస్యలతో సతమతమైందో ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి వివరించారు. అదీకాక బీఆర్ఎస్ పాలనలో యువతను నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు విపక్షంలోకి రాగానే జెన్ జీ అంటూ కొత్త నాటకాలకు తెర తీశారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రానికి డీఏపీ ఎరువుల సరఫరా పెంచండి: కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

ఆగస్టు చివరలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు శ్రీకారం: మంత్రి పొంగులేటి

Read Latest TG News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 08:52 PM