Share News

ఏఐ, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలి.. అమిత్ షాకు చిరంజీవి కీలక విజ్ఞప్తి

ABN , Publish Date - Nov 02 , 2026 | 09:33 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం నాడు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాతో వారిద్దరూ భేటీ అయ్యారు.

ఏఐ, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలి.. అమిత్ షాకు చిరంజీవి కీలక విజ్ఞప్తి
Amit Shah Hyderabad Tour

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాతో వారిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలని చిరంజీవి కోరారు. కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర రీతిలో ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు భేటీకి సంబంధించిన వివరాలను మెగాస్టార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.


మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ పోస్ట్..

'గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం వల్ల కళాకారుల హక్కులు, గౌరవం, సృజనాత్మక కంటెంట్ తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ అంశంపై నాకున్న ఆందోళనలను ఆయనకు వివరించాను. మేము వ్యక్తం చేసిన ఆందోళనలను అమిత్ షా ఎంతో శ్రద్ధగా ఆలకించారు. ఈ సమస్యను అత్యవసరంగా పరిశీలించి, మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించాలనీ సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు. సినీ పరిశ్రమకు ఇది ఒక ప్రోత్సాహకరమైన ముందడుగు. ఈ విషయంలో హామీ ఇచ్చిన అమిత్ షాకు నా కృతజ్ఞతలు. త్వరలోనే కళాకారులకు అర్థవంతమైన, పటిష్టమైన రక్షణ చర్యలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమిత్ షా.. తెలంగాణకు ఇచ్చిన నిధులెన్ని?: మంత్రి పొన్నం సూటి ప్రశ్న

సింగరేణి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

Updated Date - Nov 02 , 2026 | 09:33 PM