China Manjha: చైనా మంజా అంశంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్
ABN , Publish Date - Jan 13 , 2026 | 03:48 PM
ప్రజల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా అమ్మకాలు, వినియోగం విషయంలో తెలంగాణా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ అంశం మీద దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్.. ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక సమర్పించాలని సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది.
ఆంధ్రజ్యోతి, జనవరి 13: చైనా మంజా విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీనిపై ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను HRC ఆదేశించింది. తెలంగాణాలో బ్యాన్ చేసిన చైనా మాంజా వాడకం వల్ల జరుగుతున్న గాయాలు, మరణాలపై హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ ఇమ్మానేని రామారావు తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్(TGSHRC)లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్ 30న దాఖలైన ఈ పిటిషన్‌లో.. చైనా మాంజా పూర్తిగా నిషేధించాలని, విక్రయాలు, ఉపయోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు.
పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా చైనా మాంజా వల్ల తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవిస్తున్నాయి. కీసరలో జశ్వంత్ రెడ్డి అనే ఓ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు, షమ్షేర్‌గంజ్‌లో జమీల్ అనే వ్యక్తి మెడచుట్టూ లోతైన కోతపడి సుమారు 22 కుట్లు పడ్డాయి. ఈ మాంజా గాజు లేదా మెటల్ కోటింగ్‌తో తయారవుతుంది. దీనిని పతంగుల పోటీల్లో ఉపయోగిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది అని పిటిషనర్ విన్నవించారు.
చైనా మాంజాపై పూర్తి నిషేధం అమలు చేయాలని.. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో దీని అమ్మకాలపైనా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరుతున్నారు. కాగా.. ఇటీవల హైదరాబాద్ పోలీసులు చైనా మాంజా విక్రయాలపై దాడులు చేసి, రూ.1.24 కోట్ల విలువైన స్టాక్ సీజ్ చేశారు. 143 మందిని అరెస్ట్ చేశారు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News