Share News

అడ్రస్‌ లేకుండా బతుకుతున్నాం

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:24 AM

చెల్కపల్లికి చెందిన 40 మాదిగ కుటుంబాలు పరిహారం, ఇళ్ల స్థలాలు, రెవెన్యూ రికార్డుల్లో చిరునామా సమస్యలపై టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ను ఆశ్రయించాయి. హరీశ్‌రావుపై పలు ఆరోపణలు చేస్తూ తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

అడ్రస్‌ లేకుండా బతుకుతున్నాం
Harish Rao

హరీష్‌రావు మాకు అన్యాయం చేశారు

మీరైనా న్యాయం చేయండి

టీపీసీసీ చీఫ్‌కు చెల్కపల్లి మాదిగ కుటుంబాల వినతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట నియోజకవర్గం చెల్కపల్లికి చెందిన తమకు బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు అన్యాయం చేయడంతో అడ్రస్‌ అన్నది లేకుండా బతుకుతున్నామని ఆ గ్రామానికి చెందిన 40 మాదిగ కుటుంబాలు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఆయనకు గాంధీభవన్‌లో వినతిపత్రం సమర్పించాయి. చెల్లపల్లి గ్రామ మాదిగ వాడ అన్నపూర్ణ రిజర్వాయర్‌కు ఆనుకుని ఉందని తెలిపారు. దీంతో ఈ వాడను ఖాళీ చేయించాలని నిర్ణయించిన అధికారులు ఇళ్లకు నష్ట పరిహారం కూడా ఖరారు చేశారని వెల్లడించారు.


కానీ కూలి పనుల నిమిత్తం తమ కాలనీని చెల్కపల్లిలోనే ఉంచాలని అప్పటి మంత్రి హరీష్‌రావును గ్రామంలోని ఇతర కులాల వారు కోరడంతో ఖాళీ చేయించకుండా ఉంచారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం చెల్కపల్లిలో నివాసం ఉంటున్నా.. రెవెన్యూ రికార్డుల ప్రకారం తాము ఆ గ్రామంలో లేమని తెలిపారు. తాము ప్రస్తుతం అడ్రస్‌ కూడా లేకుండా చెల్కపల్లిలో జీవిస్తున్నామని చెప్పారు. తమ ఇళ్లలోకి నీళ్లు, పాములు వస్తుండటంతో తమ ఇళ్లకు నిర్ణయించిన పరిహారం ఇవ్వాలని హరీ్‌షరావును కోరామని చెప్పారు. దానికి ఆయన సలాంధ్ర గ్రామంలో ఇళ్ల స్థలాలు చూపించినా అవి కూడా ఇవ్వలేదన్నారు. ఎల్లయ్యపల్లి గ్రామంలో 16 మంది ఎస్సీలకు 16 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తూ పట్టాలూ ఇచ్చారని, దాన్ని సాగు చేసుకోడానికి వెళ్లితే హరీష్‌రావు మనుషులు దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నేత దేవని సతీష్ మాదిగ నేతృత్వంలో మహే్‌షగౌడ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వాతంత్య్ర సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి ఇకలేరు
కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి!
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 06:24 AM