Share News

పెరిగిన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ రద్దీ.. ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ

ABN , Publish Date - Nov 05 , 2026 | 07:05 PM

దీపావళి సందర్భంగా నగరంలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

పెరిగిన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ రద్దీ.. ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం (పాత చిత్రం)

హైదరాబాద్, నవంబరు 5: దీపావళి సందర్భంగా నగరంలోని చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు నవంబరు 6 నుంచి 11 వరకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మదీనా, ముర్గీ చౌక్, షా అలీ బండ – చార్మినార్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలని సూచించారు. కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే భక్తులు వాహనాలను పార్క్ చేయాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు తు.చ. తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.


దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయానికి మీర్‌చౌక్ నుంచి వచ్చేవారికి ముఫీద్ ఉల్ అనామ్ స్కూల్ గ్రౌండ్, సర్దార్ మహల్ రోడ్ దగ్గర పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. షా అలీ బండ నుంచి వచ్చేవారికి చార్మినార్ బస్ టెర్మినల్, యునాని ఆసుపత్రి వద్ద పార్కింగ్ కేటాయించామని వివరించారు. మదీనా, నాయాపూల్ నుంచి వచ్చేవారు SYJ కాంప్లెక్స్, కాలీ కమాన్ గర్ల్స్ స్కూల్ (ఆదివారం మాత్రమే) సమీపంలో వాహనాలను పార్క్ చేసుకోవాలని సూచించారు. పురానాపూల్, బేగం బజార్ వైపు వారికి MJ బ్రిడ్జ్, సిటీ కాలేజ్, QQ స్టేడియం వద్ద పార్కింగ్ స్థలం కేటాయించామని తెలిపారు. హుస్సేనీ ఆలం వైపు వారికి న్యూ ముర్గీ చౌక్ ఖిల్వత్ రోడ్, ఝులుఖానా లాడ్ బజార్, ఖిల్వత్ గ్రౌండ్ దగ్గరలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని చెప్పారు.


ఈ వార్తలూ చదవండి

తెలంగాణను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో గంజాయి సప్లై నెట్‌వర్క్ గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్

Updated Date - Nov 05 , 2026 | 07:10 PM