Share News

ఆరేళ్ల సంపాదనతోనే మూడు స్టార్‌ హోటళ్లు కొన్నారా?

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:44 AM

అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న వాళ్లు సైతం జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు గానీ, హోటల్‌ కానీ కొనలేకపోతున్నారని, ఆ దేశంలో కేవలం ఆరేళ్లు ఉండి వచ్చిన కేటీఆర్‌ హైటెక్‌సిటీ దగ్గర మూడు స్టార్‌ హోటళ్లు ఎలా కొనగలిగారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

ఆరేళ్ల సంపాదనతోనే మూడు స్టార్‌ హోటళ్లు కొన్నారా?
Chamala Kiran Kumar Reddy

  • కేటీఆర్‌ను నిలదీసిన కాంగ్రెస్‌ ఎంపీ చామల

  • సీఎం పర్యటనతో సిరిసిల్ల పులకించింది: వేముల వీరేశం

  • కష్టపడాల్సిన సీట్లే సీఎం రెడ్డిలకు ఇచ్చింది: మల్లు రవి

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న వాళ్లు సైతం జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు గానీ, హోటల్‌ కానీ కొనలేకపోతున్నారని, ఆ దేశంలో కేవలం ఆరేళ్లు ఉండి వచ్చిన కేటీఆర్‌ హైటెక్‌సిటీ దగ్గర మూడు స్టార్‌ హోటళ్లు ఎలా కొనగలిగారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లలో స్టార్‌ హోటళ్లు కట్టే సామర్థ్యం కలిగిన కేటీఆర్‌.. ఈ పదేళ్లు ఐటీ, మునిసిపల్‌ మంత్రిగా ఉండి తెలంగాణను ధనిక రాష్ట్రంగా ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఆర్థిక మాంద్యంతో దేశంలో చాలా హోటళ్లు మూతపడ్డాయని, కేటీఆర్‌ మాత్రం ఒక్క హోటల్‌ను మూడు హోటళ్లుగా చేసుకోగలిగారని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం, ఫార్ములా ఈకార్‌ రేస్‌ అవినీతి సొమ్మును హోటళ్లుగా మార్చారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనతో సిరిసిల్ల పులకించిందని, ఆయన పాదయాత్రతో తమ కష్టాలు తొలగిపోతాయన్న ఆనందం అక్కడి ప్రజల్లో కనిపించిందని ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం వ్యాఖ్యానించారు.


ప్రజల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంటే.. కేటీఆర్‌లో భయం కనిపిస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్‌ ఓటమి ఖాయమని, అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచి తీరతారని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల సభలో సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న కేటీఆర్‌.. పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. అమెరికా నుంచి తెచ్చిన డబ్బులతో హోటల్‌లో పెట్టానని బుకాయిస్తున్న కేటీఆర్‌.. ఒక్క హోటల్‌ను మూడు హోటళ్లు చేసే ట్రిక్కు ఏంటన్నది తెలంగాణ యువతకు నేర్పాలన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం పదవి చేపట్టాక ఎమ్మెల్యే కోటాలో రెండుసార్లు ఎమ్మెల్సీ అవకాశాలు వస్తే రెండింట్లో ఒక్కసారి కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదని, కష్టపడి గెలవాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలనే రెడ్డిలకు ఇచ్చారని ఎంపీ మల్లు రవి అన్నారు. కాగా, భద్రాచలంలో 4న నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యా ణానికి హాజరుకావాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ను హరిహర ఫౌండేషన్‌ ఆహ్వానించింది.


ఇవి కూడా చదవండి...
నా హోటళ్లకు ముఖ్యమంత్రి ప్రచారం

రూటు మారిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 04:44 AM