సోనియాను విమర్శిస్తే చరిత్ర క్షమించదు: చామల
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:38 AM
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శిస్తే కేటీఆర్‌ను చరిత్ర క్షమించదని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
హైదరాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శిస్తే కేటీఆర్‌ను చరిత్ర క్షమించదని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు.
అందుకు కేసీఆర్ కుటుంబం సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిందని బుధవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. సిద్దిపేటలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.. చరిత్రలో నిలిచిపోనుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News