Share News

తెలంగాణలో జనగణనకు గెజిట్‌ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:55 PM

తెలంగాణలో Census 2027 (జనగణన) ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జనగణనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆగస్టు 29న రాష్ట్ర గెజిట్‌లో మరోసారి ప్రచురించనున్నారు.

తెలంగాణలో జనగణనకు గెజిట్‌ నోటిఫికేషన్‌
Census 2027 Telangana

హైదరాబాద్: తెలంగాణలో Census 2027కు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను మరోసారి ప్రచురించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 29న తెలంగాణ గెజిట్‌లో నోటిఫికేషన్‌ ప్రచురించనున్నారు. Census 2027లో భాగంగా ప్రజలకు సంబంధించిన మొత్తం 40 రకాల వివరాల సేకరణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.


వ్యక్తిగత వివరాల నమోదు

జనగణనలో భాగంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరించనున్నారు. ఇందులో పేరు, వయస్సు, లింగం, వైవాహిక స్థితి వంటి వివరాలు ఉంటాయి. అలాగే కులం, మతం, ఎస్సీ, ఎస్టీ తదితర వివరాలను కూడా నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యార్హతలు, ఉద్యోగం, వృత్తి తదితర వివరాలను కూడా జనగణనలో నమోదు చేయనున్నారు. ఒక వ్యక్తి ఏ రంగంలో పనిచేస్తున్నారు? వారి వృత్తి ఏమిటి? వంటి అంశాలను కూడా సేకరించనున్నారు.


వలసల వివరాలపై ప్రత్యేక దృష్టి

ప్రజల వలసలకు సంబంధించిన సమాచారాన్ని కూడా Census 2027లో నమోదు చేయనున్నారు. వ్యక్తి పుట్టిన ప్రదేశం, ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు, గతంలో ఎక్కడ నివసించారు వంటి వివరాలను సేకరించనున్నారు. బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాల సేకరణకు కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌ వంటి గుర్తింపు పత్రాల వివరాలను నమోదు చేసే అవకాశం ఉంటుందని గెజిట్‌లో పేర్కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? లేదా? అనే వివరాలను కూడా సేకరించాలని గెజిట్‌లో పేర్కొన్నారు.


Also Read:

ఏబీఎన్ ఎఫెక్ట్.. పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజు రద్దు చేసిన ప్రభుత్వం

విమానంపై నటి షాకింగ్ స్టంట్.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..

Updated Date - Aug 27 , 2026 | 04:56 PM