Share News

విమానంపై నటి షాకింగ్ స్టంట్.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:05 PM

విమానం గాల్లో తలకిందులుగా తిరుగుతోంది.. వేల అడుగుల ఎత్తులో రెక్కపై ఓ హాలీవుడ్ నటి నిల్చుంది.. అయినా ఆమె ముఖంలో భయం లేదు! సిడ్నీ స్వీనీ చేసిన ఈ డేంజరస్ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. వివరాల్లోకి వెళితే..

విమానంపై నటి షాకింగ్ స్టంట్.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..
Sydney Sweeney Stunt

ఇంటర్నెట్ డెస్క్: హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ తన నటనతోనే కాకుండా సాహసోపేతమైన విన్యాసాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె 10,000 అడుగుల ఎత్తులో చేసిన ప్రమాదకరమైన ‘వింగ్‌వాకింగ్’ స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం గాల్లో దూసుకెళ్తుండగా దాని రెక్కకు సేఫ్టీ హార్నెస్‌తో కట్టుకుని నిల్చున్న సిడ్నీ.. ఏమాత్రం భయపడకుండా కెమెరా వైపు నవ్వుతూ కనిపించింది. 360 డిగ్రీల కెమెరాతో చిత్రీకరించిన ఈ వీడియోలో విమానం గాల్లో పల్టీలు కొడుతూ తలకిందులుగా తిరుగుతున్నప్పటికీ సిడ్నీ మాత్రం ఎంతో ధైర్యంగా కనిపించింది. కింద ఉన్న లోయలు.. ఆకాశాన్ని ఆస్వాదిస్తూ ఆమె కెమెరాకు 360 డిగ్రీల సెల్ఫీ తీసుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


స్టంట్ వీడియోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సిడ్నీ.. ‘టామ్ క్రూజ్, జాగ్రత్త’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారడంతో సిడ్నీ స్వీనీ ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వేల అడుగుల ఎత్తులో విమానం తలకిందులుగా తిరుగుతున్న సమయంలో కూడా ఆమె ముఖంలో భయం కనిపించకపోవడం చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆమెకు యాక్షన్ సినిమాల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సిడ్నీ చేసిన ఈ సాహసోపేతమైన స్టంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 27 , 2026 | 04:24 PM