వెన్ను గాయాలకు జన్యుచికిత్స!
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:52 AM
మెదడు నుంచి ఇతర అవయవాలకు కదలికలకు సంబంధించిన ఆదేశాలను చేరవేయడంలో వెన్నుపాముది కీలకపాత్ర.
నరాల తంతువుల పునరుత్పత్తిలో కీలకమైన
2 జన్యువులను గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మెదడు నుంచి ఇతర అవయవాలకు కదలికలకు సంబంధించిన ఆదేశాలను చేరవేయడంలో వెన్నుపాముది కీలకపాత్ర. దానికి గాయమైనప్పుడు మెదడు నుంచి వచ్చే కదలికల ఆదేశాలకు అంతరాయం ఏర్పడి పక్షవాతం సంభవిస్తుంది. వెన్నుపాములోని నరాలు తిరిగి శక్తిని పుంజుకోవడమూ సమస్యగా మారుతుంది. . కానీ ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించబోతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తెగిపోయిన నరాల తంతువుల పునరుత్పత్తికి సహాయపడే ఎన్‌ఆర్2ఎఫ్1, ఎన్‌ఆర్2ఎఫ్6 అనే రెండు జన్యువులను.. సీసీఎంబీలోని డాక్టర్ ఐశ్వరియా వెంకటేశ్ బృందం గుర్తించింది. ఈ జన్యువులను క్రియాశీలం చేయడం ద్వారా వెన్నుపాము గాయమైనప్పటికీ నరాలు తిరిగి పెరిగేలా చేయవచ్చని.. దీనికి సంబంధించి ఎలుకలపై తాము చేసిన ప్రయోగాల్లో పాక్షిక విజయం లభించిందని.. వారు పేర్కొన్నారు. భవిష్యత్‌లో వెన్నుపాము చికిత్సా విధానాల మార్పులో తమ పరిశోధన కీలకం కానుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు
కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్
Read Latest Telangana News And Telugu News