Share News

సీజీహెచ్‌ఎస్‌లో మందుల కొను‘గోల్‌మాల్‌’

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:27 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటైన సీజీహెచ్‌ఎస్ కేంద్రాల్లో మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన వైనంపై హైదరాబాద్‌ రేంజ్‌ సీబీఐ అధికారుల దర్యాప్తు ప్రారంభించారు.

సీజీహెచ్‌ఎస్‌లో మందుల కొను‘గోల్‌మాల్‌’
CBI CGHS case

  • మందుల కంపెనీలతో సహా 9 మందిపై సీబీఐ కేసు

హైదరాబాద్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటైన సీజీహెచ్‌ఎస్ కేంద్రాల్లో మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన వైనంపై హైదరాబాద్‌ రేంజ్‌ సీబీఐ అధికారుల దర్యాప్తు ప్రారంభించారు. లార్వెన్‌ ఫార్మా కంపెనీ, దాని యజమాని రమణయ్య, ఈ సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌, న్యూఎస్ఎస్‌ మెడికల్స్‌తోపాటు ఆ కంపెనీ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ చిరంజీవి, సీజీహెచ్‌ఎస్ ఉద్యోగులు శరవణన్‌, వైఎల్‌ఎన్‌ మూర్తి, పొన్నాల మహేష్‌, కృష్ణమూర్తిపై మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి కేసునమోదైంది.


అనవసరమైన మందులను బల్క్‌లో కొనుగోలు చేసి తద్వారా పెద్ద మొత్తంలో వచ్చిన కమీషన్లను సీజీహెచ్‌ఎ్‌స ఉద్యోగులు తమ ఖాతాల్లో వేయించుకున్నారని..వీరి ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో కేసు నమోదుచేశామని సీబీఐ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:
క్యాబినెట్‌ భేటీ లిస్టు నుంచి హ డ్కో రుణ ఫైలు రద్దు

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 06:27 AM