Share News

బీఎస్‌-6 వాహనదారులకు ఊరట!

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:52 AM

కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్‌ (పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌-పీయూసీసీ) చెల్లుబాటు విషయంలో కేంద్ర సర్కారు కీలకమార్పులు చేసింది.

బీఎస్‌-6 వాహనదారులకు ఊరట!

  • పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ ఇక ఏడాదికోసారి అక్కర్లేదు

  • సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌-1989 నిబంధనల సవరణ

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్‌ (పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌-పీయూసీసీ) చెల్లుబాటు విషయంలో కేంద్ర సర్కారు కీలకమార్పులు చేసింది. కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా 2020 ఏప్రిల్‌1 నుంచి అందుబాటులోకొచ్చిన భారత్‌ స్టేజీ-6 (బీఎస్‌) వ్యక్తిగత వాహనాలకు ప్రస్తుతం ఏడాదికోసారి పీయూసీ సర్టిఫికెట్‌ ఇస్తుండగా దాన్ని మూడేళ్లకు పెంచింది. ఫలితంగా బీఎస్‌-6 వాహనదారులకు ఏడాదికోసారి పీయూసీ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేసుకునే పని తప్పింది. బీఎస్‌-6 వాహనాలకే కాదు.. భారత్‌ స్టేజీలోని అన్ని దశల వాహనాలకు సంబంధించి నిబంధనలను కేంద్రం సవరించింది. వాహనాల ఇంజిన్‌ ఉద్గార ప్రమాణాలతోపాటు వాటి వయసును ప్రాతిపదికగా తీసుకొని పీయూసీ సర్టిఫికెట్‌ గడువును నిర్ణయించింది.


ఈ మేరకు సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌-1989లోని నిబంధనలను సవరిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జీఎస్ఆర్‌ 991(ఈ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకా రం బీఎస్‌-1, బీఎస్‌-2, బీఎస్‌-3 ప్రమాణాలకు చెంది న అన్ని వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్‌ మూడు నెలలపాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఇప్పటిదాకా ప్రతి ఆరు నెలలకోసారి పీయూసీ సర్టిపికెట్‌ తీసుకోవాలన్న నిబంధన ఉండేది. బీఎస్‌-4 వాహనాలకు మాత్రం మునుపటి మాదిరిగానే ఆరు నెలల గడువు కల్పించారు. బీఎస్‌-6 ప్రమాణాలకు చెందిన వ్యక్తిగత వాహనాలకు తొలిసారి రిజిస్ట్రేషన్‌ చేసిన తేదీ నుంచి ఆరేళ్ల వరకు ప్రతి మూడేళ్లకోసారి చొప్పున రెండుసార్లు పీయూసీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరేళ్లు దాటిన తర్వాత పదేళ్ల వరకు ఏడాదికోసారి సర్టిఫికెట్‌ తీసుకోవాలి. పదేళ్లు దాటిన వాహనాలకు ఆరు నెలలకోసారి పరీక్ష తప్పనిసరిచేశారు. బీఎస్‌-6 ప్రమాణాలకు చెందిన ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఆరేళ్ల వరకు రెండేళ్లకోసారి పీయూసీ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. ఆ తర్వాత పదేళ్ల వరకు ఆ వాహనాలకు ఏడాదికోసారి, పదేళ్లు దాటి న వాహనాలకు ఆరు నెలలకోసారి సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 04:52 AM