బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు.. ఎమ్మెల్సీల అరెస్ట్
ABN , Publish Date - Sep 08 , 2026 | 08:11 AM
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ సోమవారం నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అసెంబ్లీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ నిఖిత్ కుమార్‌పై బీఆర్ఎస్ పార్టీ నేతలు దాడి చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 08: కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ సోమవారం నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అసెంబ్లీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ నిఖిత్ కుమార్‌పై బీఆర్ఎస్ పార్టీ నేతలు దాడి చేశారు. అలాగే అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవనం వద్ద నిలిపి ఉంచిన వాహనం అద్దం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతోపాటు ఆందోళనకారులపై పీడీపీపీ (PDPP) యాక్ట్‌తో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కారు డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరు ఎమ్మెల్సీలు అరెస్ట్
బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాత మధును.. కోకాపేటలోని ఎమ్మెల్యే నవీన్ రెడ్డిని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తాత మధుపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.
బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్.. హరీశ్ రావు ఇంటికి పోలీసులు..
సిద్ధిపేట జిల్లాలోని కొండ పోచమ్మ సాగర్ వద్ద బీఆర్ఎస్ రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించనుంది. ఈ దీక్షకు బయలుదేరిన ఆ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనుంది. దాంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. వారందరిని గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి పోలీసులు వెళ్లారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటి కేసు నమోదు
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై U/s 352 r/w 3(5) BNS & Sec. 3(1)(r), 3(2)(va) కింద కేసు నమోదు చేశారు. స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వకంగా, ముందుగా ప్లాన్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఈ ఫిర్యాదులో పోలీసులు స్పష్టం చేశారు.
1000 రోజుల కాంగ్రెస్ పాలన విఫలమైందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. సోమవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ వద్ద ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేము సిద్ధం, మీరు సిద్ధమా?: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్
కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియర్లు
For More TG News And Telugu News