Share News

విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

ABN , Publish Date - Apr 06 , 2026 | 07:31 PM

హైదరాబాద్ మహానగరంలో విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేశాడు ఓ కామాంధుడు. గోల్కొండ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థిని(8) ఆటో ఎక్కింది.

విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
Hyderabad Crime News

హైదరాబాద్‌: మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకూ కామాంధులు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. అవకాశం దొరికితే చాలు కామవాంఛలు తీర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. ప్రాణాలు తీసైనా సరే కోరికలు తీర్చుకునేందుకు వెనుకాడటం లేదు. చిన్నారులపైనా అఘాయిత్యాలు ఆగడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.


తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేశాడు ఓ కామాంధుడు. గోల్కొండ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థిని(8) ఆటో ఎక్కింది. ఆమెకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్.. గోల్కొండలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి ఏడుపు గమనించిన యువకుడు మహ్మద్ ఫిరోజ్ అప్రమత్తమై ఆటో వద్దకు వెళ్లారు. కామాంధుడి నుంచి బాలికను కాపాడారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.


స్కూల్ ఐడీ కార్డు ద్వారా విద్యార్థిని తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు ఫిరోజ్. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని సలీంగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆటోను సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధైర్యసాహసాలు ప్రదర్శించి చిన్నారిని కాపాడిన ఫిరోజ్‌ను సన్మానించారు. వేగంగా స్పందించిన కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్‌‌ను అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ.. తీర్పు వాయిదా వేసిన కోర్టు

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..

Updated Date - Apr 06 , 2026 | 08:15 PM