Share News

కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే: ఎంపీ అర్వింద్

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:12 PM

సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే.. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి, బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు.

కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే: ఎంపీ అర్వింద్
BJP MP Dharmapuri Arvind

హైదరాబాద్, ఏప్రిల్ 25: సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే.. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వారిని, బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పిట్టల దొరను చూశారని.. ఇప్పుడు పిట్టల దొరసానిని చూస్తారని వ్యంగ్యంగా విమర్శించారు. కవితకు బీజేపీ రాజకీయ సమాధి కట్టిందని గుర్తు చేశారు.


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ మద్దతు లేకుండా వచ్చిందా? అంటూ కవితను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇండియా-పాకిస్తాన్ విభజన ప్రక్రియలో ఎంతో మంది చనిపోయారని వివరించారు. వీళ్లు ప్రకటించి వెనక్కి తీసుకున్నారు కాబట్టే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది చనిపోయారని చెప్పారు. ఇదే విషయంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్‌సభలో ప్రస్తావించారని పేర్కొన్నారు. తేజస్వి వ్యాఖ్యలను బీఆర్ఎస్ కళ్ళద్దాలతో చూడకండంటూ రాజకీయ పార్టీల నేతలకు ఆయన స్పష్టం చేశారు. అజారుద్దీన్ అదృష్టం బాగుందని.. అందువల్ల ఆయన మంత్రి అయ్యారన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం వల్ల అజారుద్దీన్‌ ఎమ్మెల్సీ అయ్యారని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అతి త్వరలో ఈగల్‌లో డేటా సెంటర్: ఏపీ డీజీపీ

ఉన్నతాధికారులుగా ఎదిగే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు: మంత్రి పొన్నం

For More TG News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 02:47 PM