ఉన్నతాధికారులుగా ఎదిగే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు: మంత్రి పొన్నం
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:31 PM
తెలంగాణ నుంచి శిక్షణ పొంది అత్యధిక ర్యాంకులు సాధించాలని సివిల్స్ ఆశావాహులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలోచనతో సివిల్స్ పరీక్షలు రాస్తున్న వారికి ‘రాజీవ్ అభయ హస్తం’ పేరుతో ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ నుంచి శిక్షణ పొంది అత్యధిక ర్యాంకులు సాధించాలని సివిల్స్ ఆశావాహులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలోచనతో సివిల్స్ పరీక్షలు రాస్తున్న వారికి ‘రాజీవ్ అభయ హస్తం’ పేరుతో ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు.
శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిల్‌లో 100 మందికిపైగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాసే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు మోటివేషనల్ థీమ్ సాంగ్‌ను విడుదల చేశామని చెప్పారు.
బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ థీమ్ సాంగ్ రూపొందించారని ఆయన వివరించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఆత్మస్థైర్యంతోపాటు లక్ష్యంతో ముందుకు సాగాలని కోరారు.
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో ఉన్నతాధికారులుగా ఎదిగే అవకాశాన్ని జారవిడవకుండా కృషి చేయాలని సివిల్స్ ఆశావాహులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అతి త్వరలో ఈగల్‌లో డేటా సెంటర్: ఏపీ డీజీపీ
హైదరాబాద్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు..
For More TG News And Telugu News