Share News

భారత వ్యతిరేక సదస్సు నిర్వహించారు..

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:35 AM

భారత్‌ సమ్మిట్‌లో దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, ఇందుకు సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు.

భారత వ్యతిరేక సదస్సు నిర్వహించారు..
Aleti Maheshwar Reddy

  • రేవంత్‌, రాహుల్‌ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: ఏలేటి

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): భారత్‌ సమ్మిట్‌లో దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, ఇందుకు సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన సదస్సులో యూరోపియన్‌ సోషలిస్ట్స్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్‌ భారత ఎన్నికల వ్యవస్థను ఉద్దేశించి ‘‘ఓట్‌ చోర్‌- గద్దీ చోడ్‌’’ అంటూ నినాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. ఒక విదేశీ నేత భారత అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తుంటే, పక్కనే ఉన్న రాహుల్‌ గాంధీ వారించాల్సింది పోయి చప్పట్లు కొట్టి ప్రోత్సహించడం దేశ వ్యతిరేక చర్యనేనని విమర్శించారు.


ఈ వ్యవహారం వెనుక సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారని, సదస్సు నిర్వహణతో కాంగ్రెస్‌ దేశ రాజకీయాల్లో విదేశీయుల జోక్యానికి అవకాశం కల్పించిందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని మహేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. భారత్‌ సమ్మిట్‌లో దేశ ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విదేశీయుడు జియాకోమో ఫిలిబెక్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, వీసా రద్దు చేయాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 18 , 2026 | 06:36 AM