Share News

కాంగ్రెస్‌ది ‘ప్రజా వంచన’ పాలన

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:29 AM

సెప్టెంబర్‌ 17ను హైదరాబాద్‌ విమోచన దినోత్సవంగా పిలవడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఎందుకు వెనుకాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ప్రశ్నించారు. నిజాం పాలన, రజాకార్ల కాలంలో జరిగిన పోరాటాలను చరిత్రలో పొందుపరచాలని, భవిష్యత్‌ తరాలకు వీరుల త్యాగాలను తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ది ‘ప్రజా వంచన’ పాలన
N Ramchander Rao

  • నిజాంను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కీర్తించడం సిగ్గుచేటు

  • రాంచందర్‌రావు మండిపాటు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తమది ‘ప్రజా పాలన’ అని ప్రకటించుకుంటున్న కాంగ్రె్‌సది వాస్తవానికి ‘ప్రజా వంచన పాల న’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు విమర్శించారు. సెప్టెంబర్‌ 17ను ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం’ అని పిలవడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను అధికారికంగా ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం’గా నిర్వహించడం ప్రారంభించిన తర్వాతే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించింది.


కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రజా పాలన దినోత్సవమని పేరు మార్చి వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితికి వచ్చింద’ని విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మల్కాజ్‌గిరిలో, అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల అకృత్యాలను కీర్తిస్తూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చేస్తు న్న రాజకీయాలు సిగ్గుచేటని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు చేసిన రక్తతర్పణాన్ని, పోరాటాన్ని కేవలం ‘విలీనం’ అనే పదంతో కుదించలేమన్నారు. భవిష్యత్‌ తరాలకు చరితార్థుల త్యాగాలు, పోరా ట సత్యాలు తెలియాలంటే ఈ ఘట్టాన్ని చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. వేడుకల్లో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. కాగా, సికింద్రాబాద్‌ రాష్ట్రపతి నిలయంలో విమోచన వేడుకలను నిర్వహించారు. ఆపరేషన్‌ పోలోపై నాటకం, డాక్యుమెంటరీ ప్రదర్శించారు. 800మంది విద్యార్థులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

చెక్‌పోస్ట్‌-పంజాగుట్ట ఎలివేటెడ్‌ కారిడార్‌!
పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వరూ?

Updated Date - Sep 18 , 2026 | 06:35 AM