ఉత్సాహంగా సేవా జ్యోతి యాత్ర
ABN , Publish Date - Oct 08 , 2026 | 06:26 AM
ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 సంవత్సరాల అధికార ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఖైరతాబాద్‌లో సేవా జ్యోతి యాత్ర నిర్వహించింది.
బీజేపీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తదితరులు
అప్రతిహతంగా మోదీ సుపరిపాలన: కె.లక్ష్మణ్
ఖైరతాబాద్, హైదరాబాద్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 సంవత్సరాల అధికార ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఖైరతాబాద్‌లో సేవా జ్యోతి యాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అద్యక్షుడు నితిన్ నబీన్ ఇచ్చిన వర్చువల్ సందేశాలను బీజేపీ శ్రేణులు వీక్షించాయి. అనంతరం పద్మశ్రీ సామయ్య సేవా జ్యోతిని వెలిగించి రాష్ట్ర అధ్యక్షుడికి అందించగా అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వికసిత్ భారత్ నిర్మాణం కోసం అంకితమవుతామంటూ కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. మరోవైపు 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా ప్రారంభమైన మోదీ ప్రజా సేవా ప్రస్థానం నేడు దేశ ప్రధానిగా అప్రతిహతంగా కొనసాగుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, మౌలిక వసతులు, రైల్వేలు, రహదారులు, విమానయానం, మొబైల్ తయారీ, స్టార్ట్‌పలు, రక్షణ రంగంలో దేశం గణనీయమైన ప్రగతి సాధించిందని తెలిపారు. పీఎం కిసాన్, ఉచిత రేషన్, పీఎం ఆవాస్, ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూరిందని లక్ష్మణ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల సంఘం విశ్వసనీయతను కోల్పోతోంది
త్వరలో విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News