Share News

ఆ ఏరియా వాసులుకు బిగ్ అలెర్ట్.. 10గంటల నుంచి పవర్ కట్

ABN , Publish Date - Jan 23 , 2026 | 06:55 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా ఏరియాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరానె నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతలు, ఇతర కారణాలతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

ఆ ఏరియా వాసులుకు బిగ్ అలెర్ట్.. 10గంటల నుంచి పవర్ కట్

- నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని బంజారాహిల్స్‌ ఏడీఈ జి. గోపి(Banjara Hills ADE G. Gopi) తెలిపారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు యూకో బ్యాంక్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చిరాన్‌ ప్యాలెస్‌ పీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 24 ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోల్డెన్‌ టెంపుల్‌, జూబ్లీహిల్స్‌ పీఎస్‌ ఫీడర్ల పరిధుల్లోని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బంజారానగర్‌, ఈఎస్‌ఐ స్టాఫ్‌ క్వార్టర్స్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ ఫీడర్ల పరిధుల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ పేర్కొన్నారు.


city1.2.jpg

అల్లాపూర్‌: 11కేవీ అల్లాపూర్‌ ఫీడర్‌ అయ్యప్ప సొసైటీ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఎల్‌సీ నిర్వహణ పనుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఉండనుందని ఆ శాఖ ఏఈ రాకే్‌షగౌడ్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, గాయత్రినగర్‌, జ్యోతినగర్‌, లక్ష్మీనగర్‌, చంద్రగార్డెన్స్‌ ప్రాంతం, శివబస్తీలలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు అంతరాయం ఉంటుందని తెలిపారు. అదే విధంగా అయ్యప్ప సొసైటీ ఫీడర్‌ నియర్‌ తాజా కిచన్‌ పరిసర ప్రాంతాల నుంచి చందానాయక్‌ తండా వరకు, హ్యండాయ్‌ ఓహెచ్‌ ఫీడర్‌ అయ్యప్ప రోడ్‌ నెం. 34 నుంచి రోడ్‌ నెం.38 ఆర్‌ఆర్‌ఆర్‌ వైన్స్‌ వరకు కూడా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని రాకేష్‌ తెలిపారు.


చిక్కడపల్లి: హైదరాబాద్‌ సిటీ-2 పరిధిలోని పలు ప్రాం తాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ డి. వినోద్‌కుమార్‌ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, పద్మావతినగర్‌ 11 కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, ఆబిడ్స్‌, అనుగ్రహ పరిధిలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, బాబుఖాన్‌ ఎస్టేట్‌ పరిధిలో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!

వైసీపీది భూ భక్ష పథకం

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2026 | 06:57 AM