భూదాన్ భూముల వ్యవహారం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి
ABN , Publish Date - May 25 , 2026 | 11:45 AM
భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్.. ఈడీ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్, మే 25: భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్.. ఈరోజు(సోమవారం) ఈడీ విచారణకు హాజరయ్యారు. భూదాన్ భూముల వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో ఐఏఎస్ అధికారిని ఈడీ విచారిస్తోంది. అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ భూమి బదిలీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
2024లో అమోయ్ కుమార్‌ను పలుమార్లు ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు(సోమవారం) విచారణకు రావాల్సిందిగా ఐఏఎస్ అధికారికి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మూడు సేల్ డీడ్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈరోజు సేల్ డీడ్ వివరాలు, సంబంధిత డాక్యుమెంట్లతో అమోయ్ కుమార్.. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో 2023లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. నాగారం గ్రామ పరిధిలోని భూదాన్ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 42 ఎకరాల భూమిని అక్రమంగా కట్టబెట్టి భారీ మొత్తంలో లాభాలు పొందినట్లు అమోయ్ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
అర్ధరాత్రి పోలీస్ గస్తీకి సుస్తీ
‘నీది మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్’.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
Read Latest Telangana News And Telugu News