Share News

శ్రీరాముడు అయోధ్యలో పుట్టినా.. అరణ్య వాసం చేసింది భద్రాద్రిలోనే

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:27 AM

‘వైష్ణవ్‌ జీ.. శ్రీ రాముడు అయోధ్యలో పుట్టినా అరణ్యవాసం చేసింది భద్రాచలంలోనే. అందుకే భక్తులు భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా కొలుస్తారు. ఇక్కడికి వచ్చే వేలాది భక్తుల కోసం భద్రాచలం వరకు రైలు సౌకర్యం ..

శ్రీరాముడు అయోధ్యలో పుట్టినా..  అరణ్య వాసం చేసింది భద్రాద్రిలోనే
Thummala Nageswara Rao

  • అందుకే భక్తులకు దక్షిణ అయోధ్య అయింది

  • వైష్ణవ్‌ జీ భద్రాద్రికి రైల్వే లైన్‌ నిర్మించండి: మంత్రి తుమ్మల

ఖమ్మం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ‘వైష్ణవ్‌ జీ.. శ్రీ రాముడు అయోధ్యలో పుట్టినా అరణ్యవాసం చేసింది భద్రాచలంలోనే. అందుకే భక్తులు భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా కొలుస్తారు. ఇక్కడికి వచ్చే వేలాది భక్తుల కోసం భద్రాచలం వరకు రైలు సౌకర్యం కల్పించండి. పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్‌ నిర్మించండి’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. మంత్రి తుమ్మల ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు రైల్వేశాఖ మంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.


విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి శనివారం సాయంత్రం మంత్రి తుమ్మలకు ఫోన్‌ చేశారు. అదే సమయంలో ఖమ్మం అల్లీపురంలో విలేకరుల సమావేశంలో ఉన్న మంత్రి తుమ్మల ఆయనతో మాట్లాడారు. దక్షిణ అయోధ్య విశిష్టత, భద్రాచలానికి భక్తులు వచ్చేందుకు వీలుగా పాండురంగాపురం నుంచి ఉన్న రైల్వేలైన్‌ను సారపాక వరకు 16కి.మీ. పొడిగించాలని, తద్వారా దేశం నలుమూలల నుంచి రామ భక్తులు భద్రాద్రికి వచ్చేందుకు సులువవుతుందని వివరించారు. సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వేలైన్లు నిర్మించాలని కోరగా.. చర్యలు తీసుకుంటానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...
‘సర్‌’కు వ్యతిరేకంగా 6న కలెక్టరేట్ల నిర్బంధం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తొలగింపునకు మహేశ్‌గౌడ్‌ డిమాండ్‌

గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించాలి.. 98 శాతం పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్‌
ఎస్‌ఐఆర్‌పై ప్రకాశ్‌రాజ్‌ తీవ్ర ఆరోపణలు.. మోదీ, షానే సూత్రధారులు

Updated Date - Oct 04 , 2026 | 05:28 AM