Share News

రాజ్యాంగాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:54 AM

కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు.

రాజ్యాంగాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే
Jajula Srinivas Goud

  • ఢిల్లీ బీసీ ధర్నాలో జాజుల, వీహెచ్‌, మల్లు రవి డిమాండ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50ు పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.


ధర్నాలో జాజుల, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి, బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కేశన శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తామని హెచ్చరించారు. బీసీ కులగణన సాధన కోసం బీసీ సంఘాలు డిసెంబర్‌ 14, 15 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళనలకు కాంగ్రెస్‌ మద్ద తు తెలియజేస్తున్నట్లు వీహెచ్‌, మల్లు రవి ప్రకటించారు.


వార్తలు కూడా చదవండి:

శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం

రూ.1000 కోట్ల లావాదేవీలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 06:54 AM