Share News

సుమన్ మాటల వెనక కుట్ర కేసీఆర్‌ది: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్

ABN , Publish Date - May 30 , 2026 | 04:12 PM

బీఆర్ఎస్ పార్టీ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌పై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ స్పందించారు.

సుమన్ మాటల వెనక కుట్ర కేసీఆర్‌ది: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్
Balmoori Venkat

హైదరాబాద్, మే‌30: బీఆర్ఎస్ పార్టీ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన మాటలకు కౌంటర్ గా ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ స్పందించారు. సుమన్ అరెస్ట్ కావడానికి కారణం ఆయన మాటలేనని వెంకట్ అన్నారు.


గాంధీభవన్ లో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ...'బాల్క సుమన్ అరెస్ట్ కావడానికి ఆయన మాటలే కారణం. సుమన్ వ్యాఖ్యల వెనక కేసీఆర్ కుట్ర ఉంది. మీకు కోపం ఉంటే మాపై దాడి చేయండి. సామాన్య ప్రజలు తిరిగే రైళ్లపై మీకు ఎందుకు అంత అక్కసు. రైళ్లలో తిరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలే. మీకు ఓట్లేయలేదని పెదలపై కోపమా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనూ నిరసన కార్యక్రమాలు చేశాను. మేం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేశాము' అని వెంకట్ అన్నారు.


'కేసీఆర్ ఒకయానికి డ్రగ్ శాఖ ఇచ్చాడు. మరొకరికి పిచ్చోడిలా వాగే శాఖ ఇచ్చాడు. సుమన్‌కి రైలు పట్టాలు కోసే శాఖ ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. సుమన్ లాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టాలి' అంటూ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు.


ఇవి కూడా చదవండి:

వైఎస్ వివేకా కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉంది: సీఎం చంద్రబాబు

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

Updated Date - May 30 , 2026 | 04:12 PM