బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:47 AM
బాలాపూర్ నబిల్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలాయి.
హైదరాబాద్, అక్టోబర్ 05: బాలాపూర్ నబిల్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలాయి. దాంతో మంటలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్‌లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. గోదాం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా కోట్లాది రూపాయిల నష్టం వాటిల్లిందని ప్లాస్టిక్ గోదాం యజమానులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయాల్లోకి వస్తా వివేకా హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్